Page Loader
Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా.. ఫిబ్రవరిలో 'లాల్ సలామ్' అంటూ ప్రేక్షకుల ముందుకు 
Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా

Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా.. ఫిబ్రవరిలో 'లాల్ సలామ్' అంటూ ప్రేక్షకుల ముందుకు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2024
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' ఈ సంక్రాంతి సీజన్‌కు విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫిబ్రవరి సాధారణంగా సినిమాల విడుదల అంత గొప్పగా ఏమి ఉండదు.తమిళ్ లో కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో లాల్ సలామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.

Details 

రవితేజకి రజినీతో పోటీ

విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, నిరోషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సంక్రాంతికి తప్పుకున్న రవితేజ(Raviteja) ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్ . ఇప్పుడు ఫిబ్రవరిలో ఈగల్ తో పాటు యాత్ర 2 , సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోన కూడా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఫిబ్రవరిలో కూడా సంక్రాంతి లాగే భారీ క్లాష్ రానుంది. అప్పుడు రవితేజకి రజినీతో పోటీ తప్పేలా లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర యూనిట్ ట్వీట్