
Nithiin First Look: ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు అంటున్న నితిన్.. రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా?
ఈ వార్తాకథనం ఏంటి
2020లో భీష్మ విజయం తర్వాత,నటుడు నితిన్,దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో మరోసారి #VN2 టైటిల్ తో సినిమా రానుంది.
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మేకర్స్ టైటిల్ రివీల్ గ్లింప్స్ తో ముందుకు వచ్చారు.
ఈ చిత్రానికి 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు.
ఈ గ్లింప్స్ లో నితిన్ పాత్ర ఆకట్టుకుంటుంది. దీనికి ముందు ఈ సినిమాలో నితిన్ ఓ మోసగాడు రోల్ చేస్తున్నారని మేకర్స్ వెల్లడించారు. గ్లింప్స్ లో నితిన్ క్యారెక్టర్ గురించి డిటైల్డ్‌గా వివరించారు.
Charchter Intro
అద్భుతమైన డైలాగ్ తో పరిచయం చేసుకున్న నితిన్
గ్లింప్స్ మొదలవ్వడమే .. డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే, అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటాదీ, అన్నట్టే చేసింది.
దేశం అంతా నా కుటుంబం. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు. ఆభరణాలేసుకున్నోళ్లంతా నావారు. అయినా కూడ చూడకుండా నా మీద కేసు లు పెడుతున్నారూ.
ఐనా నేను హర్ట్ అవ్వలేదు. అందుకే అయిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం నా హక్కు. నా ప్రాథమిక హక్కు.
ఎందుకంటే భారతదేశం నా దేశం. భారతీయులందరూ నా సోదరులు, సోదరీమణులు అంటూ నితిన్ డైలాగ్‌తో పరిచయం చేసుకున్నాడు.
Details
కీలకపాత్రలలో రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యంగా, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ,వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నితిన్ చేసిన ట్వీట్
Hello my dear family members,#ROBINHOOD is here 😎
— nithiin (@actor_nithiin) January 26, 2024
- https://t.co/VcFWh5KIAt#IdhiVere #VN2
@VenkyKudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/eE9fBbSzqX