
Kamal Haasan: 'కన్నడపై వ్యాఖ్యలు వద్దు'.. కమల్ హాసన్‌కు కోర్టు వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని బెంగళూరు కోర్టు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు, ఈ ఆదేశాలు వెలువరించింది. పిటిషన్‌లో కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కన్నడ భాషను తక్కువచేసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ, భాషాపరమైన ఆధిపత్యాన్ని ప్రకటించేలా వ్యాఖ్యానించకుండా, అలాగే కన్నడ భాష, సాహిత్యం, సంస్కృతిపై వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు, పోస్టులు చేయకుండా నిషేధం విధించాలని కోరారు. విచారణ అనంతరం కోర్టు, భాషల మధ్య సమానతను కలిగించే విధంగా స్పందించాలి. కన్నడకు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదు.
Details
జాగ్రత్తగా ఉండాలి
భవిష్యత్తులో సంబంధిత అంశాలపై జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 30న జరగనుంది. ఆ రోజు కమల్ హాసన్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. చెన్నైలో ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ఈవెంట్ సమయంలో కమల్ హాసన్ కన్నడపై కీలక వ్యాఖ్యలు చేశారు. శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ, ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఇది కన్నడ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇక కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది కన్నడ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.