Page Loader
Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ
కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ

Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' విడుదలపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ఈ అంశంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) సహా పలు కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమల్ హాసన్ ఓ లేఖ ద్వారా స్పందించారు.

Details

కమల్ హాసన్ వివరణ

తాజాగా కమల్ హాసన్ కేఎఫ్‌సీసీకి రాసిన లేఖలో, తాను చెప్పిన మాటలను వక్రీకరించారని, తన అసలైన ఉద్దేశం వక్రీకృతమైందని వివరించారు. కన్నడ ప్రజల మనోభావాలను గాయపర్చే ఉద్దేశం నాకు లేదు. తమిళ, కన్నడ ప్రజలు ఒకే కుటుంబంగా ఉండాలన్నది నా భావన అని స్పష్టం చేశారు. అంతేకాకుండా దివంగత నటుడు రాజ్‌కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడు, ఎక్కడ? 'థగ్ లైఫ్' ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ "కన్నడ భాష, తమిళం నుంచే పుట్టింది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే వ్యాఖ్య సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. కన్నడ భాషను తక్కువగా చూపించేలా ఉందంటూ పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Details

కర్ణాటకలో తీవ్ర విమర్శలు 

ఈ వ్యాఖ్యలపై కర్ణాటక రాజకీయ పార్టీలు, అధికార, ప్రతిపక్షాలు తక్షణమే స్పందించాయి. పలు కన్నడ సంస్కృతిక సంఘాలు, ఫిల్మ్ బాడీలు కమల్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కేఎఫ్‌సీసీ మాత్రం ఈ వివాదాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లింది. కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమాను నిషేధించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు అసహనం ఈ పిటిషన్‌పై విచారించిన కర్ణాటక హైకోర్టు, కమల్ హాసన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఇది పెద్ద సమస్యగా మారేది కాదు కదా? అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కమల్ ఇప్పుడైనా ఈ వివాదానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలన్నది కోర్టు అభిప్రాయం.