Page Loader
Sriya Reddy: 'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి
'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి

Sriya Reddy: 'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

సూమారు పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి శ్రియా రెడ్డి (Sriya Reddy) మెస్మరైజ్ చేసింది. గతంలో పొగరు, అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ముందుకొచ్చి అలరించింది. చాలా గ్యాప్ తర్వాత సలార్ లో సినిమాలో కనిపించింది. ఆమె నటనకు సర్వాత్రా ప్రశంసలు దక్కాయి. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓజీ (OG) సినిమాలో శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఓజీ సినిమా గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సినిమా ఒక కమర్షియల్ అనుకుంటారని, అయితే ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందని శ్రియా రెడ్డి పేర్కొన్నారు.

Details

పవన్ కళ్యాన్ కళ్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి : శ్రియా రెడ్డి

ఓజీ సినిమాలో 50శాతం యాక్షన్ ఉంటే, 50శాతం ఎమోషన్స్ ఉంటారని శ్రియా రెడ్డి వెల్లడించింది. ముఖ్యంగా సుజీత్ ఆ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలని అనుకుంటాడని, ఆ విషయంలో తను చాలా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడనని పేర్కొంది. పవన్ కళ్యాణ్ చాలా మంచి నటుడు అని, తన కళ్లు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని, అందులో పనిచేసే నటీనటుల గురించి ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.