NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం
    సినిమా

    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం

    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం
    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 25, 2023, 10:33 am 0 నిమి చదవండి
    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం
    ఏడాది పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్

    తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఊహలకందని విషయాలను తన సినిమాలో చూపించే రాజమౌళి, అవే ఊహలతో ఎవ్వరూ ఊహించని దాన్ని నిజం చేసి చూపించాడు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయ సినిమాలో ఒక చారిత్రక ఘట్టం. అందుకే రాజమౌళి, ది గ్రేట్ అయ్యాడు. ఈరోజుతో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై సంవత్సరం పూర్తయ్యింది. ఈ ప్రయాణంలో ఆర్ఆర్ఆర్ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆస్కార్ దాకా ఎలా తీసుకెళ్లాయో ఒకసారి చూద్దాం. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజయ్యాక ఇండియాలో మంచి సక్సెస్ అయ్యింది. అటు అమెరికాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కాకపోతే అమెరికాలో ఈసారి అమెరికన్స్ కూడా ఆర్ఆర్ఆర్ ని చూసారు.

    ఆర్ఆర్ఆర్ ను నెత్తిన పెట్టుకున్న అమెరికా ఫిలిమ్ జర్నలిస్టులు

    అమెరికాలోని సాధారణ జనాలు కాకుండా, హాలీవుడ్ కి చెందిన క్రిటిక్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసారు. చూసి ఊరుకోకుండా రివ్యూలు రాసారు, యూట్యూబ్ వీడియోలు చేసారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళ వల్లే ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ లో అంతటి ప్రాచుర్యం లభించింది. ఈ విధంగా హాలీవుడ్ జనాలకు ఆర్ఆర్ఆర్ మీద ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కారణంగానే నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగానే ఎగబడి మరీ సినిమా చూశారు ఆర్ఆర్ఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కడానికి మరో కారణం నెట్ ఫ్లిక్స్ అని చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 7వారాల పాటు నంబర్ వన్ లో నిలిచింది ఆర్ఆర్ఆర్. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ గురించి చర్చ మొదలైంది.

    ఎన్ కోర్ ల రూపంలో ఆర్ఆర్ఆర్ కు పెరిగిన ఆదరణ

    ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో, అమెరికాలో ఎన్ కోర్ ల రూపంలో ఆర్ఆర్ఆర్ సినిమాను కేవలం ఒక్కరాత్రి కోసమే థియేటర్లలో ప్రదర్శించారు. ఈ ఎన్ కోర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శించే థియేటర్లు బాగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు దర్శకుడు రాజమౌళి హాజరు కావడం, సినిమా గురించి మాట్లాడటం.. మొదలగు విషయాల వల్ల ఆర్ఆర్ఆర్ ఎన్ కోర్ లకు డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల, అక్కడ ముత్తు కలెక్షన్లను దాటి పోవడం, నాటు నాటు పాటకు సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్, ఇవన్నీ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇదంతా సంవత్సర కాలంపాటు నిర్విరామంగా జరిగింది. అందుకే ఆస్కార్ వచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రాజమౌళి
    రామ్ చరణ్

    తాజా

    LSG vs MI: 178పరుగుల లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోయిన ముంబై ఇండియన్స్  ఐపీఎల్
    ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది  ప్రేరణ
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్ తెలుగు సినిమా
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ ఐఎండీ

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ 31: ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, సాహో భామకు రెండవ తెలుగు సినిమా?  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని చెప్పిన హాలీవుడ్ డైరెక్టర్  తెలుగు సినిమా
    సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ  తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం  నాటు నాటు పాట
    ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ  తెలుగు సినిమా
    టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే  రాజమౌళి
    రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్ తెలుగు సినిమా

    రాజమౌళి

    బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు  తెలుగు సినిమా
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    రామ్ చరణ్

    రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై కీలక అప్డేట్ ఇచ్చిన శంకర్  తెలుగు సినిమా
    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  తెలుగు సినిమా
    గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్ తాజా వార్తలు
    ఆస్కార్ వేదిక నాటు నాటు నాటు పాటకు స్టెప్పులు వేద్దామనుకున్నా కుదర్లేదంటూ కారణం చెప్పిన రామ్ చరణ్ సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023