Loading...
Suriya Scene Movie: సూర్య, నజ్రియా 'సీన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
సూర్య, నజ్రియా 'సీన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Suriya Scene Movie: సూర్య, నజ్రియా 'సీన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, నజ్రియా కథానాయికగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'సీన్' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు జీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సూర్య నుంచి వచ్చిన మూడో సినిమాగా నిలిచింది. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత విడుదలైన ఈ మూవీ కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

తెలుగు, తమిళంలోనూ మంచి స్పందన

'సీన్' సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రన్‌ను కొనసాగించింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీకి సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం వినిపిస్తోంది.

డిసెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో?

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజా బజ్ ప్రకారం.. డిసెంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. స్ట్రీమింగ్ తేదీపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

వివరాలు

విలన్‌గా నెస్లేన్.. క్యామియోలో టోవినో థామస్

ఈ సినిమాలో యువ నటుడు నెస్లేన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మరో మలయాళ నటుడు టోవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించి సందడి చేశాడు.

ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు.

థియేటర్లలో మంచి స్పందన అందుకున్న 'సీన్' ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

ADVERTISEMENT