LOADING...
Pawan Kalyan: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(లండన్‌)లో స్థానం దక్కించుకున్న నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. నందమూరి తారక రామారావు వారసుడిగా బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ, జానపదాలు, కుటుంబ కథాచిత్రాలు, యాక్షన్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తన పోస్టులో పేర్కొన్నారు. ఆయన తన నట జీవితంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంలో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నటుడు, ఎమ్మెల్యే, పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలని తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ ఇలాగే నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నానని పవన్‌ కళ్యాణ్ అన్నారు.