Page Loader
Pawan Kalyan : హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్
హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Pawan Kalyan : హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2024
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' కోసం కష్టపడుతున్నారు. రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన సినిమాలపై కూడా దృష్టి సారించారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ మంగళగిరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో జరుగుతోంది, అక్కడ పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 'హరిహర వీరమల్లు' సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైంది.

Details

ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్

ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ఇటీవల సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీక్ కావడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోలో పవన్ నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. సినిమాకు మొదటగా క్రిష్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో మిగతా వర్క్‌ను పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. "హరిహర వీరమల్లు" సినిమాలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్‌లు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.