NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pawan Kalyan: తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్
    తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్

    Pawan Kalyan: తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    02:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో తొలిసారిగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రంలో నటిస్తున్నారు.

    ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో,అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.

    ఇటీవల ఈ చిత్ర బృందం హాలీవుడ్ ప్రఖ్యాత యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ నేతృత్వంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని విజయవంతంగా చిత్రీకరించింది.

    పవన్ కళ్యాణ్ సహా 400-500మంది కళాకారులతో రూపొందిన ఈ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

    'హరి హర వీర మల్లు పార్ట్-1' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వారాంతంలో విజయవాడలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

    వివరాలు 

    కీలక పాత్రలో బాబీ డియోల్ 

    ఇందులో కీలకమైన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

    పవన్ కళ్యాణ్ తో పాటు, ఈ చిత్రీకరణలో 200 మంది ఆర్టిస్టులు పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత, సినిమా నిర్మాణం పూర్తవుతుంది.

    ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండగా,నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.

    అనుపమ్ ఖేర్,నాజర్,రఘుబాబు వంటి ప్రముఖులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ. దయాకర్ రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.

    ఈ సినిమా మార్చి28న తెలుగు,తమిళం,మలయాళం,హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హరిహర వీరమల్లు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    హరిహర వీరమల్లు

    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ  పవన్ కళ్యాణ్
    హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్  సినిమా
    Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం  సినిమా
    Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025