
Pawan OG Movie : 'ఓజీ' నుంచి పవన్ కళ్యాణ్ నయా లుక్.. పోస్టర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ విందు లాంటి కబురు అందింది. ఇటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.
'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పై భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఓజీకి క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఈ చిత్రానికి అగ్ర సాంకేతిక నిఫుణులు పని చేేేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
తాజాగా విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేకమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఆయుధాలకంటే అతని కంటిచూపు చాలా పవర్ ఫుల్' అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ చిందేయనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అలరిస్తోన్న పవన్ కల్యాణ్ ఓజీ ప్రత్యేక పోస్టర్
His eyes are more powerful than any weapon. 🔥🔥🔥
— DVV Entertainment (@DVVMovies) October 23, 2023
Wishing you all a very Happy #AyudhaPooja & #VijayaDasami #FireStormIsComing #TheyCallHimOG pic.twitter.com/m8rdXNBPqD