
Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన పాట లాంచ్'కు టైం ఫిక్స్..!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు".
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నాడు. జ్యోతికృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌ను ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ పోషిస్తోంది.
"హరిహరవీరమల్లు" రెండు పార్టులుగా విడుదల కానుంది, ఈ చిత్రంలో మొదటి భాగం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
న్యూ ఇయర్ కానుకగా, అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఒక అదిరిపోయే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమా మేకర్స్ జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు "హరిహరవీరమల్లు" ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నారు.
వివరాలు
తెలుగులోనే కాక ఇతర భాషలలో కూడా పవన్ కళ్యాణ్ వాయిస్
ఇంతకు మించి, ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటమే కాక, అది తెలుగులోనే కాక ఇతర భాషలలో కూడా పవన్ కళ్యాణ్ వాయిస్‌తో ఉంటుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే పాడిన పాటలు హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే, ఇవి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఇక ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఎలాంటి క్రేజీ హిట్ సృష్టిస్తుందో అనే ప్రశ్న అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
వివరాలు
42 రోజులపాటు ఫైట్ షూట్
ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే రెడ్ డ్రెస్ ఫైట్‌ను 42 రోజులపాటు చిత్రీకరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇక, ఈ సినిమాలోని ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ వార్ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించబోతున్నాయని సమాచారం.