'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్ బయటకు..మూవీ హిట్టా ఫట్టా?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు హైప్స్ పెంచేస్తున్నాయి. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల సమయం దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. అదే సమయంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాలు
ఈవెంట్ జరిగేది అక్కడేనా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. తన సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడం లేదు. అయినప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 15న ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. వేలాది మంది అభిమానులు ఈ ఈవెంట్‌కు రానున్నారని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
వివరాలు
'ఉస్తాద్ భగత్ సింగ్' రన్ టైం ఎంతంటే?
ఇప్పటికే ఈ మూవీ విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 1 గంట 11 నిమిషాలు 30 సెకండ్లు, సెకండ్ హాఫ్ 1 గంట 22 నిమిషాలు 29 సెకండ్లు ఉండగా మొత్తం రన్ టైం 2 గంటలు 34 నిమిషాలుగా లాక్ అయింది. సాధారణంగా కమర్షియల్ సినిమాలకు ఇది సరైన రన్ టైమ్‌గా భావిస్తున్నారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.