Viswambhara : చిరంజీవి 'విశ్వంభర' సెట్స్ నుంచి ఫోటో లీక్.. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' (Viswambhara) సినిమాతో బీజీగా ఉన్న విషయం తెలిసిందే.
చిరు 156వ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్ఘ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ అధికారికంగా ఖరారు కానప్పటికీ, మూవీ స్క్రిప్ట్ సంబంధించిన ఓ పేపర్ లీక్ కావడంతో, ఈ చిత్రానికి 'విశ్వంభర' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ మొదలైంది.
ప్రస్తుతం ఈ మూవీ మారేడుమిల్లిలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో బయటికొచ్చింది.
సోషియో ఫాంటసీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా కథ పంచభూతాలు చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
Details
రేపటి వారం షూటింగ్ లో పాల్గొననున్న చిరంజీవి
ఈ సినిమా మొత్తం అడవులు, నదులు, ప్రకృతి మధ్య తెరకెక్కించనున్నారు.
ఈ మూవీ నుంచి ఓ ఫోటో బయటికొచ్చి నెట్టింట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరంజీవి లేకుండానే ఈ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రేపటి వారం నుంచి చిరు ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది.
ఈ సినిమా దాదాపు 75శాతం VFX పైనే తెరకెక్కించుబోతున్నారట.