LOADING...
SSMB 29 : సెట్స్‌ నుండి ఫోటో లీక్‌.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!
సెట్స్‌ నుండి ఫోటో లీక్‌.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!

SSMB 29 : సెట్స్‌ నుండి ఫోటో లీక్‌.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్‌ 'SSMB 29' కోసం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్‌ వచ్చినా అభిమానుల్లో క్రేజ్‌ మరింత పెరుగుతోంది. కథ, తారాగణం, సెట్‌ గురించి పూర్తి వివరాలను గోప్యంగా ఉంచేందుకు రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తాజాగా ఒక అరుదైన ఫోటో ఆన్‌లైన్‌లో లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాల్గొన్న ఫోటో నెట్‌లో బయటపడింది. ఆ చిత్రంలో మహేష్ బాబు బ్లూ టీ-షర్ట్‌, గ్రే క్యాప్‌లో స్టైలిష్‌గా కనిపించగా, ప్రియాంక చోప్రా వైట్‌ అవుట్‌ఫిట్‌లో ఎలిగెంట్‌గా మెరిసింది.

Details

 'SSMB 29' పై భారీ అంచనాలు 

ఇద్దరూ కలిసి కెమెరాకు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హల్‌చల్‌ చేస్తోంది. మహేష్, ప్రియాంక ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది. "ఫైనల్‌గా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూశాం.. ఇక సినిమా ఖచ్చితంగా ప్రపంచస్థాయి బ్లాక్‌బస్టర్ అవుతుంది" అని నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో బయటకు రావడం వల్ల 'SSMB 29' పై అంచనాలు మరింతగా పెరిగాయి. రాజమౌళి విజన్‌, మహేష్ బాబు మాస్‌ ఇమేజ్‌, ప్రియాంక చోప్రా గ్లామర్‌ - ఇవన్నీ కలిసొస్తే ఈ ప్రాజెక్ట్‌ గ్లోబల్ లెవెల్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.