LOADING...
Poonam Kaur: పవన్ ఫ్యాన్స్‌పై పూనమ్ ఫైర్.. 'ఫేక్ సింగ్' ట్వీట్ వైరల్!
పవన్ ఫ్యాన్స్‌పై పూనమ్ ఫైర్.. 'ఫేక్ సింగ్' ట్వీట్ వైరల్!

Poonam Kaur: పవన్ ఫ్యాన్స్‌పై పూనమ్ ఫైర్.. 'ఫేక్ సింగ్' ట్వీట్ వైరల్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 22, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె 'ధురంధర్ 2' సినిమా పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పేరు నేరుగా చెప్పకుండా ఆయన అభిమానులను విమర్శిస్తూ పూనమ్ కౌర్ పలుమార్లు స్పందించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు, రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'దురంధర్ 2' సినిమా ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు

మరోసారి దుమారం..

ఆమె ట్వీట్‌లో "జస్క్రిత్ సింగ్ రంగీ... నిజమైన సింగ్, ఒక నిజమైన హీరో కథ. 'దురంధర్ 2' చూడటానికి నేను తొందరగా వెళ్లాను. ఈ బాక్సాఫీస్ ముందు ఏ ఫేక్ సింగ్ నిలబడలేడు" అంటూ పేర్కొన్నారు. ఆమె ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు నేరుగా చెప్పకపోయినా, సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే మాత్రం ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటనలో భాగంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడ సిక్కు మత పెద్దలను కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన సిక్కు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ చేసిన 'ఫేక్ సింగ్' వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ 

Advertisement