Page Loader
Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు
పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

Posani: పోసానీ ఛాతీ నొప్పి డ్రామా.. క్లారిటీ ఇచ్చిన వైద్యులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైళ్ల అధికారులను, పోలీసులను అయోమయానికి గురిచేశారు. అనారోగ్యంగా ఉన్నానంటూ చెప్పి భయాందోళనకు గురి చేశారు. తర్వాత వైద్య పరీక్షల్లో అతడి ఆరోగ్య పరిస్థితి సవ్యంగానే ఉందని వైద్యులు తేల్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, శనివారం ఉదయం నుంచి ఛాతీలో నొప్పిగా ఉందంటూ జైలు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు పంపారు.

Details

రాజంపేట సబ్ జైలుకు పోసాని

రిమ్స్‌లో నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఎలాంటి అనారోగ్యం లేదని వైద్యులు తేల్చారు. ఉదయం ములాఖత్ సమయంలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి జైలులో పోసానిని పరామర్శించారు. ఆసుపత్రికి తరలించిన కొద్ది సేపటికే అతడి ఛాతీ నొప్పి డ్రామా ప్రారంభమైందని సమాచారం. రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 'పోసాని అడిగిన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాం. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని వైద్యులు ధృవీకరించారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడంతో తిరిగి రాజంపేట సబ్‌జైలుకు తరలిస్తున్నామని తెలిపారు.