Page Loader
Prabhas: రాజా సాబ్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నారా? 
Prabhas: రాజా సాబ్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నారా?

Prabhas: రాజా సాబ్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నారా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ దర్శకత్వం వహించిన ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఆనందిస్తున్నారు. వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా పోస్టర్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఎవరు గమనించలేదు. ఈ పోస్టర్ ని నిశితంగా పరిశీలిస్తే,హీరో Prabhas పేరు ''Prabhass,'గా ఉంటుంది. ప్రభాస్ తన పేరును మార్చుకున్నాడా అనే ఊహాగానాలకు దారితీసింది. న్యూమరాలజీ ఆధారంగా 'S' జోడించబడింది. అయితే,రాజా సాబ్ టీమ్ సోషల్ మీడియా పోస్ట్‌లలో అతనిని 'Prabhas' అనే ఉంటుంది.

Details 

మే 9న కల్కి 2898 AD

ఇది డిజైన్ లోపమా లేదా అసలు పేరు మార్పా అనేది ఇంకా ధృవీకరించలేదు. ఇది ఇలా ఉంటే , నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రభాస్ రాబోయే చిత్రం కల్కి 2898 AD మే 9, 2024న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ,పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.