Page Loader
Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్.. 
మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్..

Kalki 2898 AD: మొదలైన డబ్బింగ్.. మల్టీ టాస్కింగ్ మోడ్‌లో కల్కి 2898 AD టీమ్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 21, 2024
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ప్రభాస్,దిశా పటాని నటించిన పాటను చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తాజా అప్‌డేట్ వెల్లడించింది. అదే సమయంలో సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని అయాజ్ పాషా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Details 

మహిళా ప్రధాన పాత్రలో దీపికా పదుకొణె

ఈ సినిమా రిలీజ్ కోసం మేకర్స్ పనులన్నీ ఫుల్ స్వింగ్ లో అయితే కంప్లీట్ చేస్తున్నారని చెప్పాలి. ఇటీవలే BAFTA 2024 ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా హాజరైన దీపికా పదుకొణె ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌లో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.