
బాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్
ఈ వార్తాకథనం ఏంటి
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రగ్యా జైశ్వాల్, ఆ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలెట్టాయి.
ఇక ఆల్ మోస్ట్ ప్రగ్యా కెరీర్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. అదే టైమ్ లో అఖండ మూవీ వచ్చింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చి ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది ప్రగ్యా జైశ్వాల్.
జై బాలయ్య పాటలో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. సినిమా మంచి విజయం అందుకోవడంతో ప్రగ్యా జైశ్వాల్ కు మంచి పేరొచ్చింది. అభిమానులు కూడా పెరిగారు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్, మరోమారు బాలయ్య సరసన నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
బాలయ్య
యాడ్ ఫిలిమ్ షూట్ లో మెరిసిన బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్
ఈ మధ్య యాడ్ ఫిలిమ్ షూటింగుల్లోనూ బాలయ్య పాల్గొంటున్నాడు. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన సాయి ప్రియ కన్ స్ట్రక్షన్స్ గ్రూప్ యాడ్ లో బాలయ్య కనిపించారు.
తాజాగా మరో యాడ్ లోనూ బాలయ్య కనిపించనున్నాడు. ఆ యాడ్ తాలూకు చిత్రీకరణ రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగిందని తెలుస్తోంది. అందులో బాలయ్య, ప్రగ్యా జైశ్వాల్ పాల్గొన్నారని వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో షూటింగ్ లోంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, ఈ సంక్రాంతికి విడుదలై మంచి వసూళ్ళను అందుకుంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ మూవీని చేస్తున్నాడు చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే 2023 దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.