Loading...
Preity Zinta: ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!
ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!

Preity Zinta: ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై తీవ్రంగా స్పందించారు. హీరో ఆమిర్ ఖాన్‌ (Aamir Khan)ను ఆమె కావాలనే ఇగ్నోర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. నెగెటివిటీని వ్యాప్తి చేసే ఇలాంటి కంటెంట్‌ను నమ్మొద్దని అభిమానులను కోరారు. ఇటీవల ప్రీతి జింటా తన వ్యానిటీ వ్యాన్ నుంచి బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్లను దారి ఇవ్వాలని కోరారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆమిర్ ఖాన్‌ను ఆమె గమనించకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను కొందరు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఆమిర్ ఖాన్‌ను ప్రీతి జింటా ఇగ్నోర్ చేసింది' అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

వివరాలు

ఆమిర్ ఖాన్ అంటే ఎంతో ప్రేమ..

ఈ వైరల్ వీడియోపై ప్రీతి జింటా అదే పోస్ట్ కామెంట్ సెక్షన్‌లో ఘాటుగా స్పందించారు.

క్లిక్‌బైట్ కోసం ఇలాంటి ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు.

లోపల కొన్ని షాట్స్‌ను త్వరగా పూర్తి చేసుకుని, 'బట్వారా 1947' సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్లైట్ అందుకోవాలనే తొందరలో ఉన్నానని వివరించారు.

అందుకే ఆమిర్ ఖాన్‌ను గమనించలేకపోయానని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను వక్రీకరించి నెగెటివిటీని ప్రచారం చేయడమే ఉద్దేశమైతే.. ఇకపై ఫొటోల కోసం తాను ఆగుతానని ఎవరూ ఆశించవద్దని ప్రీతి జింటా అసహనం వ్యక్తం చేశారు.

ఆమిర్ ఖాన్ అంటే తనకు ఎంతో ప్రేమ, అపారమైన గౌరవం ఉన్నాయని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏమాత్రం బాగోలేవని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT