Page Loader
SSMB29: హైదరాబాద్‌కు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. SSMB29 కోసమేనా!
హైదరాబాద్‌కు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. SSMB29 కోసమేనా!

SSMB29: హైదరాబాద్‌కు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. SSMB29 కోసమేనా!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ #SSMB29. మహేష్ బాబు హీరోగా,దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించబడుతుంది. సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్ళిపోతుందో అని అభిమానులలో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. ఆమె మహేశ్‌-రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసం మాత్రమే హైదరాబాద్ వచ్చినట్లు కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా షూటింగ్ గురించి త్వరలోనే అధికారిక అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

వివరాలు 

కొత్త లుక్‌లో మహేశ్‌

ఇటీవల చిత్రబృందం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాకు శ్రీకారం చుట్టారు. కథానేపథ్యం గురించి మినహా, ఈ సినిమా గురించి ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు నటించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై మహేశ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

వివరాలు 

హాలీవుడ్‌కు జేమ్స్‌బాండ్‌.. టాలీవుడ్‌కు మహేశ్‌ బాబు: తమన్‌ 

#SSMB29పై రచయిత విజయేంద్ర ప్రసాద్‌, టాలీవుడ్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ప్రముఖులు చెప్పిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా, సంగీత దర్శకుడు తమన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన "హాలీవుడ్‌కు జేమ్స్‌బాండ్‌ అయితే, టాలీవుడ్‌కు మహేశ్‌ బాబు" అని, ఈ సినిమా 1000 కోట్ల రూపాయలు సులభంగా సాధిస్తుందని, దీని బాక్సాఫీస్‌ లెక్కలు ఎవరూ ఊహించలేనివని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహేశ్‌ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంతో ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రియాంక చోప్రా