
Pushpa 2 : స్వాతంత్ర దినోత్సవ బరిలో పుష్ప రాజ్ నిలిచేనా.. పోటీ ఎవరితోనో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2ను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2, బాలీవుడ్ అజయ్ దేవగన్ సింగం అగైన్'తో పోటీ పడనుంది.
ఈ క్రమంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడినట్లు, సింగం ఎగైన్ సోలో రిలీజ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారాంతాన్ని వినియోగించుకోవాలని గంపెడు ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అభిమానులు తాజా పరిణామంతో నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం.
ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పుష్ప 2 మంచి క్రేజ్ సాధించింది.
Details
అనుకున్న ప్రకారమే పుష్క-2 రిలీజ్
అయితే ఈ సినిమా భారీ కలెక్షన్ రికార్డులను కొల్లగొట్టాలంటే స్వాతంత్ర దినోత్సవం లాంటి వీకెండ్ రోజులు గోల్డెన్ ఛాన్స్.
అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సినిమా బృందం వెల్లడించింది.
ఆగస్టు 15నే తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని పునరుద్ఘాటించారు. దర్శకుడు సుకుమార్, సినిమాల విషయంలో ఇటువంటి జాప్యాలు జరుగడం సాధారణమేనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
పక్కాగా, అనుకున్న రీతిలో షూట్ చేసేందుకు సుకుమార్ చాలా సమయం తీసుకుంటాడన్న పేరుంది.
పుష్ప 2 విడుదలను వాయిదా పడితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న నిర్మాణ బృందం,ఎట్టకేలకు స్వాతంత్ర దినోత్సవ వారాంతంలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సినిమా పోస్ట్ పోన్ కాలేదంటున్న చిత్ర బృందం
AlluArjun's Pushpa2 Is Not Postponed#Pushpa2TheRule Releasing On Aug15 2024. pic.twitter.com/YhI2vIpgby
— C/o.AlluArjun (@CareOfAlluArjun) January 2, 2024