LOADING...
Pushpa3 : పుష్ప 3 కన్ఫామ్‌.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్
పుష్ప 3 కన్ఫామ్‌.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్

Pushpa3 : పుష్ప 3 కన్ఫామ్‌.. దుబాయ్‌లో సైమా అవార్డ్స్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన డైరక్టర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు చిత్రాలతో అల్లు అర్జున్ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగగా, పుష్ప 2 దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక పుష్ప 2 ముగింపులో, సీక్వెల్‌గా పుష్ప 3 వస్తుందని సుకుమార్ ప్రకటించారు. అయితే ఆ సినిమా వాస్తవంగా ఉండదని,కేవలం హైప్ క్రియేట్ చేసేందుకే ఆ ట్యాగ్‌లైన్‌ను వేశారని అనేక కామెంట్లు వినిపించాయి. అల్లు ర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Details

పుష్ప 3కి ఇంకా సమయం కావాలి

సుకుమార్ విషయానికొస్తే, పుష్ప తర్వాత ఆయన మరే ఇతర సినిమా చేయకుండా, ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో ఇక ఉండకపోవచ్చని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాలకు స్వయంగా సుకుమార్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న సుకుమార్, పుష్ప 3 ఖచ్చితంగా వస్తుందని స్పష్టంగా ప్రకటించారు. కానీ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం వివరించలేదు. బన్నీ, సుకుమార్ ఇద్దరి కమిట్మెంట్లు పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశం ఉండటంతో, పుష్ప 3 ఆరంభం కావడానికి ఇంకా కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.