తదుపరి వార్తా కథనం
Sritej : పెళ్లి పేరుతో పుష్ప యాక్టర్ శ్రీతేజ్ మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 26, 2024
01:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఫిర్యాదు అందింది. ఈ కేసులో బీఎన్‌ఎన్ 69, 115(2), 318(2) సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకుముందు కూడా శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో మరొక కేసు నమోదైంది. గతంలో అతను వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ వ్యవహారం తెలిసి బ్యాంక్ ఉద్యోగి సురేష్ గుండెపోటుతో మరణించారు. దీంతో మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది.
Details
పలు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్
శ్రీతేజ్ సినీ పరిశ్రమలో పలు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.
వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైజ్, మంగళవారం, ధమాకా వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించనున్నాడు.