
Pushpa The Rule: 'పుష్ప ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల విడుదల కానున్న పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన హైప్ వేరే లెవెల్‌లో ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. రష్మిక మంధాన కథానాయికగా నటించింది.
పుష్ప ది రూల్ కోసం, తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను మరింత ఉత్సాహపరిచే విధంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.
డిసెంబర్ 2న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో 12,000 కంటే ఎక్కువ థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Details
అత్యధిక థియేటర్లలో రిలీజ్
ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేస్తున్న ఇది భారతీయ సినిమాలలో అత్యధిక థియేటర్లలో విడుదలయ్యే చిత్రంగా రికార్డుకెక్కింది.
ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో, యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధమైంది.
పుష్ప ది రూల్ చిత్రం కోసం తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్ షోకు, అర్ధరాత్రి 1 గంటకు షోకి అనుమతి ఇచ్చింది.
బెనిఫిట్ షో కోసం టికెట్ ధరల్లో భారీగా పెంచింది. రాత్రి 9:30 గంటల షోకి టికెట్ ధరను రూ.800 పెంచారు.
దీంతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర సుమారు రూ.1000 అవుతోంది. మల్టీప్లెక్స్‌లో మాత్రం ఈ ధర రూ.1200కి చేరుకుంది.