Page Loader
'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న 
కల్కి సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్

'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 22, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 AD గ్లింప్స్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో ఉన్న గ్లింప్స్, అందరినీ ఆకట్టుకుంది. తాజాగా దర్శకుడు రాజమౌళి కల్కి గ్లింప్స్ పై కామెంట్ చేసారు. భవిష్యత్తు మీద సినిమాలు తీయడం చాలా కష్టమైన పని అని, దాన్ని సాధ్యం చేసి చూపించారని, గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయని, మరి రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలని రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్, వైరల్ గా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 AD సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కల్కి సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్