
Rajamouli: రాజమౌళి మాస్టర్.. మేమంతా శిష్యులం: కరణ్ జోహార్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినిమాకు ఆయన ఒక బెంచ్‌మార్క్ అని అభివర్ణించారు. రాజమౌళిని ఎవరితోనైనా పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. రాజమౌళి అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఒక సినిమాను మరో సినిమాతో పోల్చకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ మూవీ మిరాయ్ ఈవెంట్‌లో పాల్గొన్న కరణ్ జోహార్, రాజమౌళి సార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
Details
సెప్టెంబర్ 12న మిరాయి రిలీజ్
"రాజమౌళి ఒక మాస్టర్ అయితే, మేమంతా ఆయన దగ్గర నేర్చుకునే శిష్యులం" అని కరణ్ జోహార్ అన్నారు. ఇక తేజ సజ్జా హీరోగా వస్తున్న 'మిరాయ్' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్‌గా కీలక పాత్రలో నటిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా మెప్పించనున్నారు. అదేవిధంగా శ్రియా శరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ - కృతీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ విజువల్ వండర్ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.