
Rajinikanth : ఒకానొక రోజుల్లో హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రజనీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
వయసు ఎప్పుడో 75 దాటినా సినిమాల విషయంలో మాత్రం రజనీకాంత్ జోష్ ఏమాత్రం తగ్గడం లేదు.
కుర్ర హీరోలతో పోటీగా వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్న తలైవా.. ప్రస్తుతం 'కూలీ' షూటింగ్‌ను పూర్తి చేసి, 'జైలర్ 2' పనుల్లో బిజీగా ఉన్నారు. వయసు పెరిగినా, ఆయన స్టైల్, మేనరిజం మాత్రం అదే ఊపులో కొనసాగుతోంది.
ఇప్పుడు సినిమా సినిమాకీ పారితోషికాన్ని పెంచుకుంటూ.. టాప్ హీరోల్లో ఎవరికీ అందని స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా ఆయన రెమ్యునరేషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
'కూలీ' కోసం రజినీకాంత్ ఏకంగా రూ.260 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటివరకు భారత సినీ చరిత్రలో ఇంత భారీ పారితోషికం తీసుకున్న నటుడు మరొకరులేరు.
Details
శ్రీదేవి కంటే తక్కువ రెమ్యూనేషన్ తీసుకున్న రజనీకాంత్
కానీ ఇదంతా ఒకే రోజు వచ్చిందా? అదికాదు! 1970ల కాలంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా వేలల్లో ఉండేది.
మాస్టర్ డైరెక్టర్ కె.బాలచందర్ తెరకెక్కించిన 1976 మూవీ 'మూండ్రు ముడిచ్చు'లో కమల్ హాసన్, శ్రీదేవి, రజినీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ సమయంలో కమల్ హాసన్‌కు రూ.30,000, శ్రీదేవికి రూ.5,000 రెమ్యునరేషన్ ఇచ్చారు.
అదే సమయంలో రజినీకాంత్‌కు ఇచ్చిన పారితోషికం కేవలం రూ.2వేలు మాత్రమే! అయితే కాలం మారింది..
స్థితి మారింది. అప్పటి చిన్ని పారితోషికం తీసుకున్న రజినీకాంత్‌నే.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలిచారు.