
Coolie : హైదరాబాద్‌లో రజినీకాంత్ 'కూలీ' ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఇప్పటికే నిర్వహించారు. ఇక తాజాగా జూలై 22న హైదరాబాద్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ ప్రత్యేక ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలో రజినీకాంత్ హాజరవుతారా లేదా అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ ఈవెంట్ ప్రత్యేకతేంటంటే.. అనిరుధ్ ఈ కార్యక్రమంలో మూడు పాటలు స్వయంగా ఆలపించబోతున్నారు.
Details
వార్ 2 తో పోటీ
'కూలీ' చిత్ర కథ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా రజినీకాంత్ నటించిన పాత్ర గత చిత్రాలకంటే పూర్తి భిన్నంగా ఉంటుందన్న టాక్ హావభావాలు కలిగిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఏషియన్ సునీల్ ఈ మూవీ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. రజినీ హీరోగా వస్తున్న ఈ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న వార్-2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. ఇద్దరూ టాప్ స్టార్‌లు కావడంతో, ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అయితే థియేటర్ల వద్ద ఈ రెండు చిత్రాల్లో ఏది సత్తా చాటుతుందో చూడాల్సిందే.