Rajinikanth: రజినీకాంత్ 'కూలీ' టీజర్ అప్డేట్.. విడుదల తేదీ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ' (Coolie).
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ప్రముఖ నటులు శృతి హాసన్, సత్యరాజ్, అలాగే మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సాబిన్ షాహిద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Details
దసరా కానుకగా విడుదల
రజినీకాంత్ కెరీర్‌లో 171వ సినిమా అయిన 'కూలీ' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్రమ రవాణా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మార్చి 14న టీజర్ విడుదల
సినిమాపై హైప్‌ను మరింత పెంచుతూ టీజర్‌ను మార్చి 14న విడుదల చేయనున్నారు. ఆ రోజు లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు కావడం విశేషం.
ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్‌తో రజినీకాంత్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.