LOADING...
Rajinikanth : టాలీవుడ్‌ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా?
టాలీవుడ్‌ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా?

Rajinikanth : టాలీవుడ్‌ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో రజనీకాంత్‌ కొత్త సినిమా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా 'కూలీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, భారీ హైప్‌తో బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. ముఖ్యంగా తమిళనాడులో మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టి సెన్సేషన్‌ సృష్టించింది. ప్రస్తుతం 'కూలీ' విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ తర్వాత ఏ సినిమా చేయబోతున్నారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే 'వెట్టయాన్' డైరెక్టర్‌ జ్ఞానవేల్‌, మారి సెల్వరాజ్‌, శివ, ఆదిక్‌ వంటి పలువురు దర్శకులు రజనీకి కథలు చెప్పినట్టు సమాచారం.

Details

త్వరలో అధికారిక ప్రకటన 

ఇదిలా ఉంటే, ఇటీవల రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో, లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో వినిపించాయి. కమల్‌ హాసన్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో గాసిప్ హల్‌చల్‌ చేస్తోంది. అది ఏమిటంటే తెలుగు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రానికి మెగా ఫోన్‌ పట్టబోతున్నారన్నది. మహానటి, కల్కి 2898 AD వంటి బ్లాక్‌బస్టర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్‌ అశ్విన్‌ ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఓ కథ వినిపించగా, అది సూపర్‌స్టార్‌కి బాగా నచ్చిందట.

Details

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ, పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేయమని సూచించినట్టు చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే, ఈ ప్రాజెక్ట్‌ వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై రూపొందనుందని సమాచారం. అయితే ఈ సినిమా అధికారికంగా ఫైనల్‌ అయితే, నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న కల్కి 2898 AD విడుదల వాయిదా పడే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది.