Page Loader
Rajinikanth: కూలీ నెం 1421.. అదిరిపోయే లుక్‌లో రజనీకాంత్‌ కొత్త పోస్టర్ విడుదల
కూలీ నెం 1421.. అదిరిపోయే లుక్‌లో రజనీకాంత్‌ కొత్త పోస్టర్ విడుదల

Rajinikanth: కూలీ నెం 1421.. అదిరిపోయే లుక్‌లో రజనీకాంత్‌ కొత్త పోస్టర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా, లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో 'కూలీ' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రజనీకాంత్‌ కొత్త పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. పోస్టర్‌లో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌ దేవా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ లుక్‌లో రజనీకాంత్‌ చేతిలో 1421 నెంబర్‌ ఉన్న బ్యాడ్జ్‌ పట్టుకొని పవర్‌ఫుల్‌ లుక్ లో కనిపించాడు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Details

రజనీకాంత్ సరసన శృతిహాసన్

ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన నాగార్జున, సత్యరాజ్‌, శృతిహాసన్‌, ఉపేంద్ర వంటి స్టార్‌ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో, రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'జైలర్‌'కి సీక్వెల్‌ కూడా రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఇటీవలే వెల్లడించారు. సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తియైందని, అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ పైకి రానుందని తెలిపారు.