Ram Charan: రామ్ చరణ్ న్యూ లుక్.. 'వావ్' అంటున్న అభిమానులు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూడేళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం, ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు.
అయితే నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందని తెలిపారు. రామ్ చరణ్ తరువాత 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి, రామ్ చరణ్ తాజాగా గుబురు గడ్డంతో, కండలు పెంచుకొని రగెడ్ లుక్‌లో సరికొత్తగా కన్పిస్తున్నాడు.
బుచ్చిబాబు సినిమాలో మల్లయోధిగా కనిపించనుందనే ప్రచారం ఉంది. అందుకే ఈ లుక్‌కి మారినట్లు తెలిసింది.
Details
బుచ్చిబాబు సినిమా కోసం కండలు పెంచుతున్న చరణ్
దర్శకుడు వీవీ వినాయక్ పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా, చరణ్ బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు, ఇందులో ఆయన కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ క్లీన్ షేవ్ లుక్‌తో కనిపించనున్నాడు.
ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నందున, కండలు తక్కువగా ఉండేలా తీసుకుంటున్నాడు. కానీ బుచ్చిబాబు సినిమా కోసం చాలా మార్పు చేసుకున్నారు.
రామ్ చరణ్ కొత్త లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.