Page Loader
Game Changer : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ ట్రైలర్ ముహూర్తం ఖరారు ..? 
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ ట్రైలర్ ముహూర్తం ఖరారు ..?

Game Changer : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' థియేట్రికల్ ట్రైలర్ ముహూర్తం ఖరారు ..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో, మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా "గేమ్ ఛేంజర్" థియేటర్లలో విడుదల కానుంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్ కోసం అసలు సిసలైన సంక్రాంతి మొదలు అవుతుంది. అయితే, ఆ సమయానికి ముందే,గేమ్ ఛేంజర్ మేకర్స్ తమ అభిమానులను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కోసం సిద్ధం కావాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు, గేమ్ ఛేంజర్ నుండి విడుదలైన "జరగండి","రా మచ్చా","నానా హైరానా","డోప్" పాటలు బ్లాక్ బస్టర్స్‌గా మారాయి. తమన్ అందించిన సంగీతం పట్ల ప్రశంసలు కురిసాయి. అలాగే,లక్నోలో గ్రాండ్‌గా జరిగిన టీజర్ రిలీజ్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు,సినిమా ఓపెనింగ్స్‌ను నిర్ణయించే అసలు ట్రైలర్ విడుదలకి సిద్ధమైంది.

వివరాలు 

డిసెంబర్ 30న హైదరాబాద్‌లో ఈవెంట్

ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ పై ఉన్న అంచనాలను మరింత పెంచేందుకు పవర్‌ఫుల్ ట్రైలర్ విడుదల అవుతుంది. ప్రస్తుతం, ట్రైలర్ కట్‌ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 27న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగాల్సినది కానీ, ఆ సమయం వాయిదా వేసింది. అయితే, ఇప్పుడు డిసెంబర్ 30న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగొచ్చని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరవ్వాలని భావిస్తున్నారు. అలాగే, జనవరి మొదటి వారంలో ఏపిలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారని సమాచారం. ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.