Page Loader
Ramam..Raghavan Teaser Release: కమెడియన్‌ ధనరాజ్‌ దర్శకత్వంలో రామం...రాఘవన్‌ టీజర్‌ రిలీజ్‌ 
కమెడియన్‌ ధనరాజ్‌ దర్శకత్వంలో రామం...రాఘవన్‌ టీజర్‌ రిలీజ్‌

Ramam..Raghavan Teaser Release: కమెడియన్‌ ధనరాజ్‌ దర్శకత్వంలో రామం...రాఘవన్‌ టీజర్‌ రిలీజ్‌ 

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
08:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌ పై పృథ్వీ పోలవరపు నిర్మాణ సారథ్యంలో వెర్సటైల్‌ నటుడు సముద్ర ఖని (Samudra Khani)తో రూపొందిస్తున్న సినిమా రామం రాఘవన్‌ (Ramam Raghavan). టాలీవుడ్‌ కమెడియన్‌ నటుడు ధనరాజ్‌ (Dhanaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ టీజర్‌ శనివారం విడుదలైంది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు బాల (Directro Bala), పాండిరాజ్, సముద్రఖని, నటుడు బాబీ సింహా (Bobby Simha), తంబిరామయ్య తదితరులు పాల్గొని ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.

Details

సముద్ర ఖని లేకుంటే నేను దర్శకుడిగా మారే అవకాశమే లేదు: ధనరాజ్  

ఈ సందర్భంగా దర్శకుడు ధనరాజ్‌ మాట్లాడుతూ...ఈ సినిమా కథ రచయిత శివప్రసాద్‌ అన్నారు. ఈ కథ గురించి సముద్రఖని తో చెప్పగా ఈ సినిమాను నువ్వే డైరెక్ట్‌ చేయమని ప్రోత్సహించాడని తెలిపారు. నేను పనిచేసిన సినిమాల దర్శకుల నుంచి నేర్చుకున్న విషయాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించానన్నారు. సముద్ర ఖని అన్న లేకుంటే నేను దర్శకుడిగా మారే అవకాశమే లేదని చెప్పారు. ప్రేక్షకులందరూ వాళ్ల నాన్నలతో కలిసి సినిమాను చూడాలని ఈ సందర్భంగా ధనరాజ్‌ కోరారు.

Details

 తండ్రీ కొడుకుల మధ్య బంధమే ఈ సినిమా  

అనంతరం సముద్ర ఖని మాట్లాడుతూ...నేను దాదాపు 10 సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించానని ...ఒక్కొక్కటీ ఒకో విభిన్న పాత్ర అని అన్నారు. అలాంటి వైవిధ్యమైన పాత్ర మళ్లీ ఇందులో పోషించానని తెలిపారు. ధనరాజ్‌ కు తల్లిదండ్రులు లేరు. స్వతహాగా పెరిగి ఈ స్థాయికి చేరుకున్నాడని, అతడిపై చాలా నమ్మకముందని తెలిపారు. అందుకే ఈ కథను డైరెక్ట్‌ చేయమని చెప్పానని, దర్శకుడిగా పెద్ద విజయం సాధిస్తాడని చెప్పారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య బంధం గురించి చూపిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కథతో కనెక్ట్‌ అవుతారని తెలిపారు. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. కాగా, ఈ సినిమా టీజర్‌ విడుదల అనంతరం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.