Ramayana: 'రామాయణ' పార్ట్ 1 పూర్తి.. మూవీపై రణ్‌బీర్ కపూర్ అప్‌డేట్
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నందుకు రణ్‌బీర్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. 'రామాయణ' ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఈ కథను వింటూ పెరిగానని, ఈ చిత్రంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు పనిచేస్తున్నారని చెప్పారు. నితీశ్ తివారీ అద్భుతంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారని, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామన్నారు. పార్ట్ 1 షూటింగ్‌ను ఇప్పటికే పూర్తియైందన్నారు.
శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్
త్వరలోనే పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభమవుతుందన్నారు. ఈ చిత్రంలో నటించడం నా కల నెరవేరిందని రణ్‌బీర్ చెప్పారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం సైలెంట్‌గా జరుగుతోంది. అయితే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇటీవల లీక్ అయ్యాయి. ఈ సినిమాలో రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి నిర్మాణసంస్థ అధికారిక ప్రకటన చేసింది. 2026 దీపావళికి 'రామాయణ' మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు, అలాగే డైట్ కూడా ఫాలో అవుతున్నారు. ఆయన మద్యపానం మానేసినట్లు కూడా వెల్లడించారు.