Loading...
Ramayana: రామాయణ'కు హాలీవుడ్ పోటీ.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల రేసులో భారతీయ సినిమా

Ramayana: రామాయణ'కు హాలీవుడ్ పోటీ.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల రేసులో భారతీయ సినిమా

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

రణ్‌ బీర్‌ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ పార్ట్ 1' అంతర్జాతీయ అవార్డుల రేసులో మరో కీలక అడుగు వేసింది. 32వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రాథమిక షార్ట్‌లిస్ట్‌లో ఈ సినిమా రెండు సాంకేతిక విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్టంట్ డిజైన్ విభాగాల్లో హాలీవుడ్‌కు చెందిన భారీ చిత్రాలతో కలిసి 'రామాయణ' పోటీ పడుతోంది. దీంతో భారతీయ సినీ అభిమానుల దృష్టి ఇప్పుడు ఈ అంతర్జాతీయ అవార్డులపై పడింది.

Details

'ది ఒడిస్సీ', 'డ్యూన్ 3'తో ఢీ

'రామాయణ' అంతర్జాతీయ మార్కెట్లలో 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' పేరుతో విడుదల కానుంది.

విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'గాడ్జిల్లా మైనస్ జీరో' వంటి చిత్రాలతో ఈ సినిమా పోటీ పడుతోంది.

మరోవైపు క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' 11 విభాగాల్లో, డెనిస్ విల్లెన్యూవ్ 'డ్యూన్: పార్ట్ త్రీ' 8 విభాగాల్లో షార్ట్‌లిస్ట్ కావడం విశేషం.

అలాంటి భారీ హాలీవుడ్ ప్రాజెక్టుల సరసన 'రామాయణ' నిలవడం భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా మారింది.

Details

59 సినిమాల నుంచి తుది పోటీకి

అయితే ఇప్పుడే అవార్డు ఖరారైందని అనుకోవడానికి లేదు. 12 సాంకేతిక విభాగాల్లో మొత్తం 59 చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు.

ఇందులో నుంచి ప్రతి విభాగానికి ఆరు సినిమాలను తుది నామినేషన్ల కోసం ఎంపిక చేయనున్నారు.

తుది నామినేషన్లను డిసెంబర్ 4న ప్రకటించనున్నారు. అనంతరం 2027 జనవరి 3న శాంటా మోనికాలో జరిగే అవార్డుల వేడుకలో విజేతలను ప్రకటిస్తారు. అంటే 'రామాయణ'కు అసలు పరీక్ష ఇంకా ముందే ఉంది.

ADVERTISEMENT

Details

రణబీర్ రాముడు.. యష్ రావణుడు

నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌ బీర్‌ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు.

హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతం అందించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

మొదటి భాగం అంతర్జాతీయ అవార్డుల రేసులోకి వెళ్లడం ఇప్పటికే ఆసక్తిని పెంచగా, కథ కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'రామాయణ పార్ట్ 2' 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు 'రామాయణ' తుది నామినేషన్లలోనూ చోటు దక్కించుకుని అవార్డు గెలుస్తుందా అన్నదే ఆసక్తిగా మారింది.

ADVERTISEMENT