Yash: రామాయణం షూటింగ్ షురూ.. యుద్ధ సన్నివేశాల కోసం ముంబైలో భారీ షెడ్యూల్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్‌లో రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా, మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ మాగ్నమ్ ఓపస్‌పై అన్ని వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్న విషయం ఇప్పటికే తెలిసిందే.
Details
ముంబైలో కీలక షెడ్యూల్
తాజా సమాచారం ప్రకారం ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యష్, రణబీర్ కపూర్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం.
ఇక తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో యష్‌తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవలి కాలంలో వచ్చిన 'ఆదిపురుష్' సినిమా ప్రేక్షకుల నిరాశకు గురైన సంగతి తెలిసిందే.
ఓం రౌత్ ఈ ఇతిహాసాన్ని చూపించిన విధానం విమర్శలపాలై ప్రేక్షకుల ఆగ్రహాన్ని తెచ్చుకుంది. అందుకే నితేష్ తివారీ తన వెర్షన్‌లో రామాయణాన్ని ఎలా చూపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.