Operation Valentine: రేపు ఆపరేషన్ వాలెంటైన్స్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న రామ్ చరణ్, సల్మాన్ ఖాన్
వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, గాండీవధారి అర్జున్ పరాజయం తరువాత,మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఆపరేషన్ వాలెంటైన్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా,భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రుహని శర్మ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా మార్చి 1, 2024న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రేపు ఉదయం ట్రైలర్ రిలీజ్
చిత్ర నిర్మాతలు రేపు గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రేపు ఉదయం 11:05 గంటలకు నిమిషాలకు రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. హిందీ ట్రైలర్ను సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్ను రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని,గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతలు. ఆపరేషన్ వాలెంటైన్ కి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ .