
Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో రమ్య మోక్ష.. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా వెలుగులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో AAA థియేటర్లో ఇటీవల 'వచ్చినవాడు గౌతమ్' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు, కథానాయిక రియా సుమన్ ఆకట్టుకున్నారు.
మరోవైపు, రమ్య మోక్ష కంచర్ల ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచయమైన రమ్య ఈ టీజర్ లాంచ్‌లో మెరిసి తన ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించింది.
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్ ముగ్గురిలో రమ్య మోక్ష ఇప్పుడు సినీ రంగంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో ఒక వీడియోలో రమ్య మాట్లాడుతూ "నేను ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాను, అందులో మేకప్ లేకుండా నటించానని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Details
కథానాయికగా రియా సుమన్
ఇలాంటి పరిస్థిలో 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు రమ్య హాజరైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, రమ్య ఈ సినిమాలో పాత్ర పోషిస్తుందా? అనే విషయంపై అధికారిక సమాచారం అందలేదు.
అయినప్పటికీ ఆమె ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తోంది. 'వచ్చినవాడు గౌతమ్' సినిమాలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్నారు. కథానాయికగా రియా సుమన్ నటిస్తోంది.
టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో రమ్య మోక్ష హాజరుకావడంతో ఆమె సినిమా సంబంధం ఉందా అనే ఆసక్తి క్రియేట్ అయింది.