
Rana Daggubati : రానా పుట్టినరోజు స్పెషల్.. రాక్షసరాజా ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి నటనా పరంగా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాడు.
అలాంటి లీడర్, దగ్గుబాటి రానా పుట్టినరోజు నేడు. బాహుబలిలోని భల్లాలదేవ నుంచి రాక్షసరాజా హిరణ్యకశిపుడు వరకు ప్రస్తుతం ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తెలుగు సినిమాకి 'రానా దగ్గుబాటి' ఒక పెట్టని కోటగా పేరు గాంచాడు.
హీరోగా, విలన్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, నిర్మాతగా, హోస్ట్'గా సినిమా రంగానికి పలు విధాలుగా సేవలు అందిస్తున్నాడీ లీడర్.
'కేరాఫ్ కంచరపాలెం' వంటి మంచి సినిమాలు బయటకి రావాలన్నా రానా కావాలి. 'ఘాజీ'తో సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులకు గుర్తింపు దక్కాలన్నా రానా సహాయం కావాల్సిందే.బాహుబలి, కల్కి సినిమాలతో సరిహద్దులు చెరిపేసేందుకు రానా సహకారం ఉండాల్సిందే.
DETAILS
ప్రమోషన్స్ బాధ్యతలను స్వీకరించిన లీడర్
ప్రస్తుతం కల్కి ప్రపంచస్థాయిలో ప్రచారం కావాలి. ఇందుకోసం ప్రమోషన్స్ బాధ్యతలను రానా స్వీకరించాడు.
లీడర్'గా తొలి సినిమాతోనే హిట్ అందుకున్నా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ చేరాడు. దీంతో హిందీ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసి అక్కడ పేరు సంపాదించుకున్నాడు.
కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి వైవిధ్యమైన సినిమాలతో ముందుకెళ్తున్నాడు.
హీరోగా ఎదుగుతున్న సమయంలో బాహుబలిలో విలన్ పాత్రకే తన మొదటి ప్రాధాన్యత ఇచ్చి భల్లాలదేవగా రానా చూపించిన విలనిజం ఆయన తప్ప మరొకరు పోషించలేరేమో అనిపించేలా నటించారు.
భల్లాలదేవగా రాక్షసత్వం చూపించిన రానా త్వరలో రాక్షస రాజా హిరణ్యకశ్యపుడు పాత్ర చేయనున్నారు.
details
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నేడు డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా రానా కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. 'రాక్షస రాజా' అనే టైటిల్'తో ఫస్ట్ లుక్ పోస్టర్'ని రిలీజ్ చేశారు.
అలాగే తాను హిరణ్యకశ్యపుడి పాత్రని పోషిస్తూ మైథాలజీ మూవీ 'హిరణ్యకశ్యప'ని కూడా తెరకెక్కించనున్నారు.
బాహుబలిలో భల్లాలదేవగా అదరగొట్టిన రానా, హిరణ్యకశ్యపుడిగా ఎలా ఉంటాడో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫలితంగా ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొదలైన రాక్షస రాజా
#RakshasaRaja Begins 🔥🔥 pic.twitter.com/CeabZPCejE
— Rana Daggubati (@RanaDaggubati) December 14, 2023