Page Loader
దగ్గుబాటి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. రానా తమ్ముడి వివాహం ఎవరితో తెలుసా
నా తమ్ముడి వివాహం ఎవరితో తెలుసా

దగ్గుబాటి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. రానా తమ్ముడి వివాహం ఎవరితో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
06:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు ఓ ఇంటి వాడు కానున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్‌ బాబు చిన్న కుమారుడు, హీరో అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు సమాచారం. రామానాయుడి తమ్ముడి మనవరాలినే అభిరామ్‌ పెళ్లీ చేసుకోనున్నట్లు టాక్. సురేశ్‌బాబు చెల్లెలి కూతురితోనే అభిరామ్‌ జీవితాన్ని పంచుకోబోతున్నాడు. సురేష్, చెల్లెలి ఆమె కుటుంబం కారంచేడులో ఉంటోంది. అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నప్పట్నుంచే పరస్పరం ఇష్టపడుతున్న నేపథ్యంలో వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయని తెలుస్తోంది. తాతా రామానాయుడు కోరిక కూడా ఇదేనని టాక్ వినిపిస్తోంది. అభిరామ్ వివాహం, శ్రీలంకలో చేయాలని కుటుంబీకులు ఆలోచిస్తున్నారట.

DETAILS

డిసెంబర్‌ 6న పెళ్లి జరగనున్నట్లు సమాచారం

దగ్గుబాటి అభిరామ్, డిసెంబర్‌ 6న పెళ్లి చోసుకోనున్నట్లు, ఈ మేరకు శుభలేఖలను వినూత్నంగా డిజైన్‌ చేయిస్తున్నారని సమాచారం. కారంచేడులో రామానాయుడు ఉన్న పాత ఇంటి డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చు వేయిస్తున్నారట. ఇటీవలే దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా అహింస విడుదలైంది. బాక్సాఫీస్‌ దగ్గర ఈ చిత్రం బోల్తా పడటంతో అభిరామ్‌ కాఫీ షాప్ ఓపెన్‌ చేసే పనిలో నిమగ్నమయ్యాడట. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్‌ కాఫీ షాప్‌ పేరిట ఓ దుకాణం తెరిచేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. మరోపక్క అభిరామ్‌ అన్నయ్య, దగ్గుబాటి రానా 2020లో మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ అగ్ర కథనాయకుడు విక్టరీ వెంకటేష్, అన్న రెండో కుమారుడే అభిరామ్.