
Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..
ఈ వార్తాకథనం ఏంటి
నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సీజన్ 2పై హీరో రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటులు విక్టరీ వెంకటేష్,రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు ఇదే మొదటి సీజన్‌కు కొనసాగింపుగా వస్తోంది.
ఈ సిరీస్‌ను కరణ్ అర్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా,ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రానా మీడియాతో మాట్లాడుతూ,తెలుగు ప్రేక్షకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
తెలుగు ప్రేక్షకుల స్పందనపై రానా స్పందన:
రానా మాట్లాడుతూ.."రానా నాయుడు సీజన్ 1 ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వీక్షించారు. కానీ, తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం ఆశించినంత స్పందన రాలేదు" అని తెలిపారు.
ఇందుకు కారణంగా మొదటి సీజన్‌లో ఉన్న అసభ్య పదాలు (బూతులు), ఎక్కువ శృంగార దృశ్యాలు, హింసని పరోక్షంగా రానా సూచించారు.
సీజన్ 2లో మార్పులు:
ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకుని, రానా నాయుడు సీజన్ 2లో కొన్ని మార్పులు చేసినట్లు రానా వెల్లడించారు.
"ఈ సీజన్‌లో బూతులు తగ్గించాం.. కానీ హింసను మాత్రం పెంచాం" అని స్పష్టం చేశారు. రానా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా:
మొదటి సీజన్‌లో అధిక శృంగార దృశ్యాలు, అసభ్య సంభాషణలు ఉన్నాయని తెలుగు ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.
ఆ వ్యాఖ్యల ప్రభావంతో, ఇప్పుడైతే చిత్ర బృందం సీజన్ 2ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేలా మార్పులు చేసినట్టు రానా మాటల ద్వారా అర్థమవుతోంది.
అయితే, ఈ మార్పులు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటాయా లేదా?, బూతులు తగ్గించి హింసను ఎక్కువచేసిన విధానం ఎంతవరకు ప్రేక్షకులకు నచ్చుతుందనేది చూడాల్సి ఉంది.