Page Loader
Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెస్ సిరీస్

Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 13, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరోలు, దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) అరుదైన రికార్డులకెక్కింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన సిరీస్‌గా చరిత్ర లిఖించింది. రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ 'రానా నాయుడు' (Rana Naidu). ఈ సిరీస్‌'ను వివాదం వెంటాడిన బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రముఖ ఓటిటి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా విడుదలైన రానా నాయుడు సిరీస్ అరుదైన ఘనతను సాధించింది. తాజాగా 2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన డేటాను నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఇందులో 'రానా నాయుడు' అగ్రస్థానం దక్కించుకుంది.

details

భారత్ నుంచి ఇదొక్కటే వెబ్ సిరీస్

భారతదేశం నుంచి ఈ ఒక్క సిరీస్‌ మాత్రమే జాబితాలో ఉండటం విశేషం. ఇక 2021 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రతి వారం ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్ 10 మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం 6 నెలల జాబితాను విడుదల చేసింది. వ్యూస్‌ ఆధారంగా సుమారు 18 వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌లను సాధించిన టాప్‌ 400 జాబితా రిలీజ్ అయ్యింది. ఇందులో 'రానా నాయుడు' టాప్‌ 336లో నిలిచింది.

details

336వ పొజిషన్ కైవసం చేసుకున్న రానా నాయుడు

భారత్‌ నుంచి ఈ సిరీస్‌ మాత్రమే టాప్‌ 400లో స్థానం దక్కించుకుంది. దీన్ని 46 మిలియన్ల గంటలు చూసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'రే డొనోవన్‌'కు రీమేక్‌గా ఈ సిరీస్‌ రూపొందింది. ఇందుకోసం దగ్గుబాటి స్టార్స్ రానా, వెంకటేశ్‌ ఫస్ట్ టైమ్ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో తండ్రీ కొడుకులుగా ఆకట్టుకున్నారు. తాజాగా దీనికి సీక్వెల్‌ను సైతం తెరకెక్కించనున్నట్లు ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఎన్నో ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామాతో కూడిన 'రానా నాయుడు-2' వెబ్ సిరీస్'ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది.