Dhurandhar 2 : 'బాహుబలి' రికార్డు బ్రేక్.. దూసుకెళ్తున్న 'ధురంధర్ 2'.. రానా రియాక్షన్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల రిలీజ్ అయిన 'ధురంధర్ 2' ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది. విడుదల అయినప్పటి నుంచే సినిమా ప్రశంసలు అందుకుంటూ, ఇప్పటికే అనేక రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 'బాహుబలి' సృష్టించిన రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. అక్కడ అత్యధిక వసూళ్ల సాధనలో టాప్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో, 'బాహుబలి' లో భళ్లాలదేవ్ పాత్రలో తన ప్రదర్శనతో అందరి మనసులను గెలుచుకున్న రానా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
వివరాలు
ఆ సినిమాలే ముందుంటాయి..
రానా మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమా సాధిస్తున్న రికార్డులు చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా 'బాహుబలి' పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు 'ధురంధర్ 2' సొంతం చేసుకుంది. 'బాహుబలి', 'ధురంధర్' వంటి సినిమాలు మరిన్ని రావాలని కోరారు. ఎన్ని సినిమాలు వచ్చినా, ప్రతీ సినిమా ప్రత్యేకత దానిదే అని చెప్పారు. తమ సాంస్కృతిక సంప్రదాయాలను, వాతావరణాన్ని ప్రపంచానికి చూపించడంలో కొరియన్ సినిమాలు ముందుంటాయని రానా అన్నారు.
వివరాలు
రూ.1500 క్లబ్ లోకి ధురంధర్2
విడుదలైనప్పటి నుంచే వసూళ్లలో సునామీ లాగే కొనసాగుతున్న 'ధురంధర్ 2' తాజాగా రూ. 1,500 కోట్లు క్లబ్‌లోకి చేరింది. నిర్మాణ సంస్థ తెలిపిన ప్రకారం, అందులో ఇండియాలో రూ.1,100 కోట్లు సాధించినట్లు సమాచారం. అత్యంత వేగంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాపై రాజమౌళి, మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు కూడా తమ ప్రశంసలు వ్యక్తం చేశారు.