Ranabaali: నెట్‌ఫ్లిక్స్‌లోకి రణబాలి.. థియేటర్లలో ఆదరించని తెలుగు ప్రేక్షకులు ఓటీటీలోనైనా చూస్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, ఆయన భార్య రష్మిక మందన్నా హీరోయిన్‌గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన భారీ చిత్రం 'రణబాలి'. భారతీయ చరిత్రకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా, రణబాలి అనే కల్పిత పాత్రతో ఈ సినిమాను రూపొందించారు. అయితే థియేటర్లలో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోయింది.
వివరాలు
నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన రణబాలి
సినిమా విడుదలైన తర్వాత కొంతమంది కావాలనే ఈ చిత్రాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారనే చర్చ కూడా అప్పట్లో జరిగింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
ఓటీటీలోనైనా ఆదరిస్తారా?
థియేటర్లలో ఇలాంటి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు విఫలమయ్యారనే అభిప్రాయాలు మరోసారి వినిపించే అవకాశం ఉంది.
మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుంది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.