రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్
కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మనందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలతో కృష్ణవంశీ ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. రఘవరావు(ప్రకాష్‌రాజ్) తన వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్న రంగస్థల నటుడు. తాను సంపాదించిన ఆస్తి తన కొడుకు రంగారావు(ఆదర్శ్), శ్రీ(శివాత్మిక)లకు రాసిచ్చేస్తాడు. సంతోషంగా రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. రంగరావు కన్నబిడ్డలకు, ఏ దిక్క లేకుండా అయిపోవడానికి కారణం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. రంగమర్తాండ సినిమాలో ప్రత్యేకంగా ఒక్కరి నటన గురించి చెప్పనక్కర్లేదు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మనందం ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. రమ్యకొన్ని కొన్ని చోట్ల కంటి చూపుతోనే మాట్లాడడం విశేషం. ఈ ముగ్గురు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం డైలాగ్స్ హైలెట్
కోడలి పాత్రలో అనసూయ ఎంతో సహజంగా నటించింది. రాహుల్, శివాత్మిక, ఆదర్శ్ ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను చూపించారు. ముఖ్యంగా అమ్మనాన్నలను ఎలా చూసుకోవాలి.. ఎలా చూసుకోకూడదనే విషయాలను గుండెను పిండేలా కృష్ణవంశీ చూపించాడు. ఇక బిడ్డలు పుట్టనందుకు ఎంతో అదృష్టవంతుడ్ని అంటూ బ్రహ్మనందం చెప్పించిన డైలాగ్ ఎంతో లోతుగా అనిపిస్తుంది. ప్రథమార్థంలో కాస్త సరాదాగా సాగిన ద్వితీయార్థం వచ్చే సరికి గుండె బరువెక్కేలా చేస్తాడు. బ్రహ్మనందం, ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సీన్లు ఒకెత్తు అయితే.. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ సీన్ మరో ఎత్తు పాటలు వినసొంపుగా ఉన్నాయి. రేటింగ్ : 3/5