తదుపరి వార్తా కథనం
Allu Arjun: అల్లు అర్జున్ కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నుంచి నోటీసులు.. ఎందుకంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 05, 2025
10:29 am
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రాకూడదని పోలీసులు సూచించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రానున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరామర్శకు వస్తే పోలీసుల సూచనలను పాటించాలని, ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చి నియమాలను ఉల్లంఘిస్తే, దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.