
Rapid Action Force : రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ...సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా విడుదలైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force) సినిమా సైలెంట్ గా వచ్చేసింది.
దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించారు.
ఓఎస్ ఎమ్ తో కలసి దీపికా ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను రూపొందించింది.
మిహిరామ్ వినయతేయ (Mihiram Vinayatheya) దర్శకుడి వ్యవహరించారు.
వినయతేయకు ఈ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి.
హీరో సూర్యకు దర్శకుడిగా వినయతేయకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే థియేట్రికల్ రన్ లో పెద్దగా కలెక్షన్లు రాలేదు.
దేశభక్తి నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.
Rapid action Force-Movie-Ott
థియేటర్లలో ఫ్లాప్...ఓటీటీలో హిట్
మ్యూజిక్, కెమెరా, ఆర్ ఆర్ ఇలా డిపార్ట్ మెంట్స్ కు మంచి పేరు తెచ్చినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకలేకపోయింది.
కొన్ని కొన్ని సినిమాలు థియేటర్ లో క్లిక్ కాలేకపోయినా ఓటీటీ, టీవీ ప్లాట్ ఫామ్ లలో మంచి హిట్ అవుతుంటాయి.
ఇటీవలే సౌండ్ లేకుండా అమెజాన్ ప్రైమ్ కి వచ్చి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కూడా ఓటీటీలో హిట్ టాక్ నడుస్తోంది.
థియేటర్ లో ప్లాప్ అయి ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇంతకుముందు ప్లాప్ సినిమాల నిర్మాతల ప్రాణం లేచి వచినట్లైంది.
తమ సినిమా కూడా ఇందులోనైనా హిట్ కాకుండా పోతుందా అని.